//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హీరోయిన్ మోనల్ గజ్జర్ కు షాకింగ్ అనుభవం..!

Category : politics

రోజు ప్రపంచం అంతటా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి .మహిళా దినోత్సవం నాడు హీరియిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ రియ‌ల్ మహిళా పవర్ అంటే ఎంటో అందరికి తెలిసేలా చేసింది.ఈమె తెలుగు, తమిళం మలయాళం , మరాఠి చిత్రాలలో నటిస్తున్నది.

ఈమె ఈమధ్య తన చెల్లి నడుపుతున్న పార్లర్ కి వెళ్ళింది.అక్కడకు వెళ్లిన సందర్భం లో ఆమె కారును షాప్ ముందు పార్క్ చేసి లోపలి వెళ్ళింది. కాసేపు అయ్యాక ఆమె తిరిగి బయట వున్న కారు దగ్గరకు వచ్చింది.అప్పుడు అక్కడ ఒక వ్యక్తి భహిరంగ మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు,ఆమె కారులో నుండి హారన్ మోగించింది అయిన కూడా ఆటను వినకుండా తన పని తాను చేసుకున్నాడు.

తరువాత ఆ నిందుతుడు మోనాల్‌ గజ్జర్ వద్దకు వచ్చి ఎందుకు హారన్ అంతగా కొడుతున్నావని ఆమె ను దూషించసాగాడు. అతడు మాట్లాడిన సంభాషణను మొత్తం ఆమె తన ఫోనో లో రికార్డు చేసింది.తరువాత ఆ వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ వీడియో వైరల్ కావడం తో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు.కాగా పోలీస్ లు అతనిని గుల్బాయ్ టెక్రా కాంప్లెక్స్‌లో షాప్ కీప‌ర్‌గా పనిచేస్తున్న కమ్లేష్ ప‌టేల్ గ గుర్తించారు.ఈ విష‌యంలో తనకు మ‌ద్దతుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపింది మోనాల్ గ‌జ్జ‌ర్‌. సుడిగాడు , వెన్నెల వన్ బై టూ, బ్రదరాఫ్ బొమ్మాళి తదితర టాలీవుడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ అమ్మ‌డు బాగా దగ్గరయ్యింది.