అండర్-19 వన్డే వరల్డ్కప్ క్రికెట్ లో మరో సంచలనం.క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడిన ఆఫ్గనిస్తాన్ సంచలన విజయం నమోదు చేసింది.ఆఫ్గనిస్తాన్ స్వినర్స్ దాటికి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 309 పరుగులు చేసింది. రహ్మతుల్లా గర్బాజ్(69), ఇబ్రహీం జాడ్రాన్(68), అజ్మతుల్లా ఒమర్జాయ్ (66) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో అజ్మతుల్లా చెలరేగి ఆడటంతో అఫ్గాన్ స్కోరు 300 పరుగులు దాటింది.అజ్మతుల్లా 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు బాదాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఏ దశ లోను విజయం దిశ గా సాగలేదు.న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది.బ్యాటమెన్స్ అందరూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.అఫ్గాన్ బౌలర్లలో ఖాయిస్ అహ్మద్, ముజీబ్ నాలుగేసి వికెట్లు నేలకూల్చారు. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. దీనితో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అఫ్గానిస్తాన్ తలపడనుంది.