Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

REDMI 7A స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5799 ధరతో విడుదలయ్యింది : ఇవే ప్రత్యేకతలు

Category : technology business

ముందుగా ఊహించినట్లుగానే, చైనాలో బడ్జెట్ ధరలో మంచి స్పెక్స్ తో విడుదలైనటువంటి షావోమి యొక్క రెడ్మి 7A ని ఇండియాలో అతితక్కువ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, రూ. 5,999 ధరలో పెద్ద బ్యాటరీ మంచి డిస్ప్లే మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో విడుదలయ్యింది. అయితే, జూలై నెలలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం 200 రూపాయల ధరను తగ్గించి రూ. 5,799 ధరకె అందిస్తోంది. షావోమి, ఈ కార్యక్రమాన్ని తన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అందించింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూలై 11 వ తేదీ నుండి Flipkart మరియు Mi.com ద్వారా జరగనుంది.

షావోమి రెడ్మి 7A - 2GB + 16GB - రెగ్యులర్ ధర : Rs.5999

షావోమి రెడ్మి 7A - 2GB + 32GB - రెగ్యులర్ ధర : Rs.6199

షావోమి రెడ్మి 7A - 2GB + 16GB - జూలై అఫర్ ధర : Rs.5799

షావోమి రెడ్మి 7A - 2GB + 32GB - జూలై అఫర్ ధర : Rs.5999

షావోమి రెడ్మి 7A స్మార్ట్ ఫోన్, ఒక పాలికార్బోనేట్ తో ఇవ్వబడింది మరియు ఇది P2i నానో-కోటింగ్ ద్వారా అందించబడింది కాబట్టో స్ప్లాష్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఈ షావోమి రెడ్మి 7A ను 18:9 ఆస్పెక్ట్ రేషియో కలిగినటువంటి ఒక 5.45 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించింది. అలాగే, ఇది ఒక 2.0 GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసరుకు జతగా, 2GB ర్యామ్ మరియు 16 GB లేదా 32 GB ఎంపికలతో వస్తుంది. అధనంగా, ఆండ్రోయిడ్ 9 పై ఆధారంగా MIUI 10 OS తో లాంచ్ చేశారు.

ఈరోజు షావోమి రెడ్మి 7A ఇండియాలో విడుదలకానుంది.చౌక ధరలో ఒక 48MP+5MP డ్యూయల్ కెమేరాగల REDMI NOTE 7 PRO మరొక సేల్48MP + 5MP కెమేరా ఫోన్ REDMI NOTE 7 PRO మరొక సేల్ఇక REDMI NOTE 7S ఓపెన్ సేల్ ద్వారా అమ్మకం48MP బడ్జెట్ ఫోన్ REDMI NOTE 7S ఫ్లాష్ సేల్ఇక ఈ ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది ఒక 12MP సింగిల్ రియర్ కేమేరా Sony IMX 486 సెన్సారుతో అందించబడింది. ముందుభాగంలో సెల్ఫీ కోసం, ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ షావోమి పరికరం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది.

Related News