21 సంవత్సరాల వయసులో ఎన్నో విజయాలు సొంతం చేసుకొని భారత దేశ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంటున్న సింధు విజయ రహస్యం.
పోరాట పటిమ : ఒలంపిక్స్ లో తనమీద గెలిచిన కరోలినా మారిన్ ఫై గెలచి ఒలంపిక్స్ లో ఓటమిని విజయంగా మార్చుకోటానికి అసలైన కారణం సింధు కనపరిచిన అద్భుత పోరాట పటిమ.
ఆటలో వేగం: అంతకుముందు సైనా నెహ్వాల్ ఫై విజయం సాధించడంలో తోడ్పడింది తన ఆటలో వేగం పెంచడం. సైనా నెట్ మీద డ్రిబ్లింగ్ చేయడంలో, పాయింట్ సాధించడంలో నేర్పరి. సింధు ఆ అవకాశం సైనాకు రానివ్వకుండా జాగ్రత్త పడడంతో సైనా మీద విజయం సొంతమైంది.
టెక్నిక్: ప్రత్యర్థి పోరాట పటిమను, నైపుణ్యాన్ని, బలహీనతల్ని సరిగ్గా అంచనా వేసి ప్రత్యర్థి బలహీనతలన్ని తన బలంగా మార్చుకొనే విధంగా ఆడటం సింధు అసలు విజయ రహస్యం.
ఏది ఏమైనా, సింధు విజయ ప్రయాణం మరింత ముందుకు సాగిస్తూ భారత బ్యాడ్మింటన్ కీర్తి పతకాలను ఎగరవేస్తుందనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహంలేదు.