//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేప్ లు అత్యాచారాల్లో బిజెపి వారే ముందున్నారట

Category : national politics

ఇప్పుడు దేశంలో అత్యాచారాల మాట వింటేనే ప్రజలు మండిపడిపోతున్నారు. ఉన్నావ్ రేప్ ఘటన మరువక ముందే కథువా రేప్ బయటకు వచ్చింది. ఆ తర్వాత అస్సాం లో జరిగిన ఒక రేప్, గుజరాత్ లో జరిగిన మరో రేప్..ఇలా ప్రతి ఒక్కటి ఆడపిల్లలకు సమాజంలో రక్షణ లేదు అని చెప్పే ఘటనలే. అయితే రేప్ లు చేసే వాళ్ళలో ప్రజా ప్రతినిధులు కూడా ఉండటం నిజంగా పలువురుని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులే అత్యాచారాల్లో పాల్గోన్నారట. వారిలో బిజెపి వారే అధికం..

ఈ విషయాన్ని ఒక సంస్థ బయటపెట్టింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమెక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) సంస్థ నిర్వహించిన సర్వేలో కేసులు ఎదుర్కొంటున్న వారు 51 మందిలో 48 మంది ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎంపీలు కాగా వీరిలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే 14 మంది ఉన్నారు. ఏడుగురు కళంకిత ప్రజాప్రతినిధులతో మహారాష్ట్రకు చెందిన శివసేన రెండో స్థానంలో ఉండగా..బెంగాల్ అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ (6) మూడో స్థానంలో ఉంది. ఈ వివరాలు తెలుసుకునేందుకు గాను ఏడీఆర్‌ సంస్థ ఎంపీ, ఎమ్మెల్యేలకు చెందిన 4,852 అఫిడవిట్‌లను పరిశీలించింది.

మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు 51 మందిపై ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఈ విధమైన కేసులతో మహారాష్ట్ర 12 మంది ఎంపీ, ఎమ్మెల్యేలతో టాప్‌లో ఉండగా.... 11 మంది కళంకిత ప్రజాప్రతినిధులతో పశ్చిమబెంగాల్‌ రెండోస్థానంలోనూ.. ఒడిశా (6)మూడో స్థానంలో ఉన్నాయి.అయితే ఇలాంటి కేసులు నమోదై.. విచారణ కొనసాగుతున్నా మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున దర్జాగా పోటీచేసిన అభ్యర్థులు 334 మంది ఉండగా... వీరిలో 40 మందికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా పోటీ చేసేందుకు ఆయా పార్టీలు టికెట్‌లు ఇవ్వడం గమనార్హం.