//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజుగారి గది 3" లాంచ్ ప్రధాన పాత్రధారిగా తమన్నా

Category : movies

ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా గతంలో వచ్చిన "రాజుగారి గది" భారీ మొత్తంలో విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తరువాత వచ్చిన "రాజుగారి గది 2" ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.దాంతో ఈ సారి తమన్నాను ప్రధాన పాత్రధారిగా తీసుకుని "రాజుగారి గది 3" సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు.కేవలం కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.రేపటి నుంచి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.విభిన్నమైన కథాకథనాలతో అనూహ్యమైన మలుపులతో ఈ కథ సాగుతుందని ఓంకార్ అన్నాడు.ఈ సినిమాలో తమన్నాకు జోడీగా అశ్విన్ బాబు కనిపించనున్నాడు.ఇటీవల హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చేసుకుంటూ వస్తోన్న తమన్నా,ఆ జాబితాలోకి ఈ సినిమాను కూడా చేర్చేసింది.