//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రధాని తన విజయాలు ఎందుకు చెప్పుకోవడం లేదు

Category : national politics

ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టి దాదాపు నాలుగేళ్ళు కావొస్తుంది. మరి ఎన్నికల ప్రచారంలో ఈ నాలుగేళ్ళలో తాను ఏం చేసానో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు..? ఇప్పుడు ఈ ప్రశ్న ఆ పార్టీ వారిని సైతం వేధిస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మోడీ ఎంతసేపు విపక్షాలను లక్ష్యంగా చేసుకుని లేదా సామాజిక వర్గమే లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు గాని ఎక్కడా కూడా తాను ఏమి సాధించాను అనేది చెప్పుకోలేకపోతున్నారు.

తాను ప్రకటించిన ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పది కోట్ల ఇల్లు కట్టించామని మీడియా ముందు చెప్పుకునే మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అంత పెద్ద విజయాన్ని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. అదే విధంగా జిఎస్టి విషయంలో ఎందుకు చెప్పుకునే సాహసం చెయ్యలేకపోతున్నారు. అదే విధంగా నోట్ల రద్దు ద్వారా నల్లదనం తీసుకుని వచ్చామని చెప్తున్న మోడీ సర్కార్ ఎందుకు తమ విజయాలను చెప్పుకోలేకపోతుంది...? జనధన్ యోజన విషయంలో ఎందుకు సాహసం చెయ్యడం లేదు..?

ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆ పార్టీ వారిని సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. విమర్శలను ఎక్కువగా ప్రజలు నమ్మే అవకాశం ఉండదు అని కేవలం తమ విజయాలను చెప్పుకు౦టేనే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏ ప్రధాని ఇవ్వని స్థాయిలో మోడీ హామీలు ఇచ్చారని ఏ ప్రధానిని నమ్మని రీతిలో ప్రజలు మోడిని నమ్మారని మరి అలాంటప్పుడు వారిలో మోసం చేసారు అనే భావన రావడానికి ఎంతో సమయం పట్టే అవకాశం ఉండదు అని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.