సాధారణంగా షియోమీ ఫోన్లంటే చాలా తక్కువ ధరనే కలిగి ఉంటాయి.అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే బడ్జెట్లో ఆ కంపెనీ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తుంటుంది.అయితే షియోమీ తాజాగా విడుదల చేసిన ఈ ఫోన్ ఖరీదు మాత్రం అక్షరాలా రూ.4.80 లక్షలు.అవును,మీరు విన్నది నిజమే.ఇంతకీ అదేం ఫోనంటే..షియోమీ నిన్న భారత మార్కెట్లో రెడ్మీ కె20, కె20 ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాగా వీటిలో రెడ్మీ కె20 ప్రొ ఫోన్‌కు గాను సిగ్నేచర్ ఎడిషన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది.ఈ వేరియెంట్ ధరను రూ.4.80 లక్షలుగా నిర్ణయించారు.దీన్ని బంగారంతో తయారు చేయడం విశేషం.అలాగే ఈ ఫోన్‌పై వజ్రాలను పొందుపరిచారు.అందుకే దీనికి అంత ధరను నిర్ణయించారు.అయితే ఈ ఫోన్‌ను వచ్చే వారం నుంచి భారత మార్కెట్లో విక్రయిస్తారు.ఇక ఇందులో ఫీచర్లన్నీ రెడ్మీ కె20 ప్రొ స్మార్ట్ఫోన్లోనివే ఉంటాయి.వాటిల్లో ఎలాంటి మార్పూ లేదు.