//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ ఈ-కామర్స్ అబోఫ్‌ సైట్‌ మూత

Category : business

ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రంగప్రవేశంతో ఆన్‌లైన్ షాపింగ్‌కి మంచి ఆదరణ లభించింది. అయితే ఆ తరవాత ఇలాంటి వెబ్‌సైట్లు నగరానికి ఒకటి పుట్టుకొచ్చాయి. దీంతో పోటీ పెరిగిపోయింది. ఒకప్పుడు దేశంలోనే మూడో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా వెలుగొందిన స్నాప్‌డీల్ నష్టాలు భరించలేక కంపెనీని అమ్మకానికి పెట్టింది. అయితే తాజాగా ఓ పెద్ద గ్రూప్‌కు చెందిన ఈ-కామర్స్ సంస్థను ప్రారంభించిన రెండేళ్లకే మూసేస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన ఫ్యాషన్ పోర్టల్ ఆదిత్య బిర్లా ఆన్‌లైన్ ఫ్యాషన్ (abof.com) తమ లావాదేవీలను ఆపేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు బెంగళూరులో గురువారం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటుచేసి ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని కంపెనీ మేనేజ్‌మెంట్‌తో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ గుప్తాకు ఒక నెల ముందుగానే చెప్పారట. ప్రస్తుతం 200 నుంచి 250 కింది స్థాయి ఉద్యోగులు అబోఫ్‌లో పనిచేస్తు్న్నట్లు కంపెనీ గుర్తించింది. వీరందరినీ గ్రూప్ కంపెనీల్లోకి బదిలీ చేసి మరో నాలుగు నెలల్లో అబోఫ్‌ను మూసేయాలని ఆదిత్య బిర్లా గ్రూప్ నిర్ణయం తీసుకుంది.