దశాబ్దాల యుద్ధంతో అతలాకుతలమైన అఫ్ఘానిస్థాన్ టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టింది. పటిష్ట భారత జట్టుతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీ దూరం కావడంతో రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
కీపర్ సాహా, బౌలర్ షమీ కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వారి స్థానాల్లో దినేష్ కార్తిక్, ఉమేష్ యాదవ్ జట్టులోకొచ్చారు. కార్తిక్ చాలా కాలం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఓపెనర్లుగా ధవన్, విజయ్ ఉండడంతో లోకేష్ రాహుల్ మిడిలార్డర్లో ఆడనున్నాడు. ధావన్ సెంచరి చేయగా విజయ్ ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు.