//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ రాజకీయం.....ప్రకాశం జిల్లాలో ఏ పార్టీ బలం ఎంత.......?

Category : politics

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో రాజకీయం ఏవిధంగా ఉందొ ఇప్పుడు చూద్దాం...ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా మంచి పట్టున్న జిల్లాగా ప్రకాశం జిల్లా పేరుగాంచింది. ఇక్కడి నుండి రాష్ట్రానికి అలాగే దేశానికీ ఎందరో రాజకీయం గా సేవలందించారు.

స్వసంత్ర సమరయోధుడి, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుతీరు ప్రకాశం పేరు మీద ఏర్పాటు అయిన జిల్లా ఇది. ఈ జిల్లా నుండి ఏంటో మంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఈ జిల్లానుండి కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, రామానాయుడు, కోనేజేటి రోశయ్య, కరణంబలరాం వంటి కీలక నేతలు ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లా ఇది.

ఇప్పుడు ఈ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం...పోయిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు ఎమ్మెల్యే లు వైసీపీ నుండి, ఐదుగురు ఎమ్మెల్యే లు టీడీపీ నుండి ఒకరు స్వసంత్ర అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్రం లో మారినరాజకీయ పరిస్థితులవల్ల ఇప్పుడు ఇక్కడ టీడీపీ కి పదిమంది ఎమ్మెల్యే లు వున్నారు. వైసీపీ కి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ జిల్లాలో హోరాహోరీ పోటీ తప్పదని తెలుస్తుంది. కొంతమంది కీలక నేతలు పార్టీ మారడం తో రాజకీయం వేడెక్కింది. ఈసారి ఎన్నికల్లో పరుచూరి నుండి దగ్గుపాటి వారసుడు పోటీ చేయనున్నాడని సమాచారం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కి 5 , టీడీపీ కి 5 సీట్లు రావచ్చు అని అంచనా, మిగిలిన రెండు నియోజక వర్గాల్లో పోటీ తీవ్రస్థాయిలో ఉండనుంది అని సమాచారం.

Related News