రాజ్‌కిరణ్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘విశ్వామిత్ర’. నందితరాజ్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా హీరో హీరోయిన్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు. రాజ్‌కిరణ్ దర్శకుడు.
మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు. ఆదివారం ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రసాద్‌ల్యాబ్స్‌లో అశుతోష్ రాణా విడుదల చేశారు. రాజ్‌కిరణ్ మాట్లాడుతూ ‘‘ఓసారి అమెరికాలో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివాను. దాని ఆధారంగా ఈ కథ మొదలుపెట్టా... అలాంటి ఘటనే స్విట్జర్లాండ్‌లో కూడా జరిగిందని చెప్పారు. ఆ వివరాలు కూడా సేకరించి ఈ కథ పూర్తి చేశా.
నిర్మాతలు మొదటి సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఈ కథతో చాలామంది హీరోయిన్స్‌ని కలిసి హీరో సత్యం రాజేశ్ అని చెప్పగానే డ్రాప్ అయ్యారు. నందితరాజ్ కథ నమ్మి సినిమా అంగీకరించారు. రాజేశ్‌ని హీరోగా నిలబెడతా. 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని అన్నారు.
‘‘కథ పరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. కానీ ప్రాముఖ్యత ఉన్న పాత్ర’’ అని సత్యం రాజేశ్ అన్నారు. ‘‘ప్రస్తుతం హారర్, త్రిల్లర్ సినిమాలా హవా నడుస్తోంది. నిజంగా జరిగిన కథతో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ఇది’’ అని నిర్మాత మాధవి అద్దంకి చెప్పారు. ఇందులో పొసెసివ్ భర్త పాత్రలో కనపడతాను. చాలా మంచి పాత్ర. నందిత రాజ్ పాత్ర కీలకం’’ అని అశుతోశ్ రాణా చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి. నందిత అంటే హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని సినీ వర్గాలు చెప్తున్నాయి...