//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ది గ్రేట్ "బర్త్ డే"

Category : editorial

ఈ ప్రపంచాన్ని ఎంతో మంది చక్రవర్తులు, మహారాజులు ఏలారు. కానీ ఎవరికి దక్కని కీర్తి ప్రతిష్టలు ఒక్క శ్రీరామచంద్ర మూర్తికే దక్కాయి. అంత జనరంజకంగా పాలించడం వలనే వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా నేటికి శ్రీరాముడు అందరి హృదయాల్లో నిలిచే వున్నాడు. మనం అతన్ని దశావతారాల్లో ఒకడిని చేసి దేవూణ్ణి చేసిన శ్రీరాముడు ఎప్పటికీ ఈ జాతి ఆత్మలో మంచి పాలకుడిగానే మిగిలిపోయాడు. ధర్మ పంధాన నడిచి పరిపాలన చేసిన ఒకే ఒక చక్రవర్తిగా శ్రీరాముడు చరిత్రలో ,పురాణాల్లో కనిపిస్తాడు. అతన్ని వాల్మీకి సృష్టించిన పురాణ పురుషుడిగానే భావించినా ఆ వ్యక్తిత్వం ఆవిర్భవించిన చైత్ర శుద్ధ నవమి శాశ్వతంగా ఆ చంద్ర తార్కారం గా నిలిచిపోయంది.

అధికారం కోసం అడ్డదారులు తొక్కకుండా, ప్రజాధనం పెళ్లి భోజనంలా ఆరగించకుండా .. చివరికి ప్రజాభిప్రాయం ప్రకారం కట్టుకున్న భార్యను వదిలేసిన ఘనత ఈ మహానుభావుడిది. అందుకే ఎంత ఘనంగా ప్రజలందరి చేత ఉత్సవాలు జరిపించుకుంటున్నా కొందరి చేత అంతే అప్రదిష్టను మూటకట్టుకున్నాడు. కఠిన హృదయుడని, కట్టుబట్టలతో కట్టుకున్న భార్యను అడవులకు పంపాడని ,అధికార దాహం ఎక్కువని ఎంతో మంది ఆయనపై విమర్శల వర్షం కురిపించారు .

ఇప్పుడు యువత ఎవరినో చూసి బాహుబలి బాహుబలి అని కేకలు ఈలలు వేస్తుంది కానీ అసలు బాహుబలి 'రాముడు'. వాల్మీకి వర్ణన ప్రకారం శ్రీరాముడు. ఆజానుబాహుడు అంటే పొడవైన చేతులతో విశాలమైన బాహువులు కలిగిన ఎత్తైన సుందర రూపం ఈ సీతాపతిది. అతని రూపం చూసి మోహించిన వారందరూ తర్వాత అవతారంలో ఆయన ప్రియసఖులుగా, గోపికలు జన్మించారని ప్రతీతి. అంటే రాముడిది అంత ఆకర్షనీయమైన రూపం. రూపంలోనే కాదు గుణంలోను అతడు సుగుణాభి రాముడు. అందుకే సీతాదేవి స్వయంవరంలో రాముణ్ణి చూడగానే అతనే తన భర్తని చేయమని అమ్మవారిని ప్ర్రార్దించిందట. అయితే సీతమ్మకు మాత్రం ఏం తక్కువ రాముడు కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఏదో ప్రార్థన చేసుంటాడు. సీతయే తన భార్య కావాలని కాకపోతే అది బయటకి రాలేదు.

వేల సంవత్సరాల చరిత్ర గర్భంలో కలసిపోయిన శ్రీరాముడు జన్మాదినానికి భారతదేశ ప్రజలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఊరు వాడ పందిళ్లు వేసి, పుట్టినరోజుతో పాటు వివాహవేడుకను ఘనంగా చేస్తున్నారు. తరతరాలనుంచి ఇదొక హిందూ పండగల కొట్టిపారేయకుండా అత్యధిక కాలం నుండి జరుపుకుంటున్న ఓ పాలకుడు పుట్టినరోజుగా గుర్తించి రికార్డులకు ఎక్కించడం ఫై ప్రపంచం దృష్టి సారించాలి .