Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించ బోతున్న కమలం పార్టీ.....!

Category : politics

గత 2014 లోక్ సభ ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించిన బీజేపీ .ఆ ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా - ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ నిలిచినట్టుగా ప్రకటించుకుంది.అప్పట్లో దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం కోసం ఏకంగా పది లక్షల మంది కార్యకర్తలను నియమించింది బీజేపీ. ఇదంతా అప్పట్లో అమిత్ షా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం భారీ స్థాయిలో కొనసాగింది. తద్వారా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా పదకొండు కోట్ల మంది ప్రజలు బీజేపీ సభ్యత్వాలను స్వీకరించారట.

తద్వారా అత్యధిక మంది సభ్యులున్న పార్టీ తమదే అని బీజేపీ పార్టీ పేర్కొన్నారు.ఈ విషయంలో తాము ప్రపంచ రికార్డును సృష్టించినట్టుగా కమలం పార్టీ ప్రకటించుకుంది. అయితే ఈ సారి అంతటితో ఆగడం లేదట. త్వరలోనే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టనుంది. ఈ దఫా మరో ఇరవై అయిదు శాతానికి పైగా అధికంగా సభ్యత్వాలను ఇవ్వాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందట.అంటే మరో రెండున్నర కోట్ల మందికి పైగా అదనంగా పార్టీ సభ్యత్వాలను ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుందట. ప్రస్తుతం కమలం పార్టీ ఊపును చూస్తే.. అదేం అంత కష్టం అయ్యే పని లా కనిపించడం లేదు.