//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీపీసీ ప్రమాదంపై న్యాయ విచారణ చేపట్టాలి

Category : national

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ప్రమాదంపై న్యాయ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో గురువారంనాటికి మృతుల సంఖ్య 29కి చేరుకున్నది. ప్రమాదం సంగతి తెలియగానే ఆయన రాయ్‌బరేలీకి వెళ్లి క్షతగ్రాతులను పరామర్శించారు.

ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభు త్వోద్యోగం కల్పించాలన్నారు. ప్రమాద స్థలాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్ గురువారం సందర్శించారు. మంత్రి ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున నష్టపరిహారం..తీవ్రంగా గాయపడిన వారికి రూ.10లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2లక్షలు అందజేస్తామన్నారు. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు అదనంగా రూ.2లక్షలు అందజేస్తామని ప్రధాని మోదీ తెలిపారు.