//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ తింటే...

Category : world national

హైదరాబాద్ బిర్యానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వస్తే బిర్యానీ రుచి చూడకుండా ఉండరు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బోన్‌లెస్ బిర్యానీ, తందూరి బిర్యానీ, రొయ్యల బిర్యానీ.. ఇలా ఒకటేమిటి.. అన్ని రకాల బిర్యానీలు రారమ్మని భోజన ప్రియులను ఊరిస్తుంటాయి. అందుకే వీకెండ్‌లో రెస్టారెంట్లు కిక్కిరిసిపోతుంటాయి. హైదరాబాద్ బిర్యానీని మరిపించేలా దుబాయిలో కొన్ని రెస్టారెంట్లు చాలా రుచికరంగా బిర్యానీలను తయారు చేస్తుంటాయట. యూఏఈలోని దుబాయి, షార్జాహ్ నగరాల్లో ఓ అయిదు రెస్టారెంట్లలో బిర్యానీ అదుర్స్ అంటున్నారు అక్కడి పౌరులు, మన ప్రవాసులు.

1. సిల్వర్ స్పూన్ (Silver Spoon): షార్జాహ్‌లోని ఈ సిల్వర్ స్పూన్ రెస్టారెంట్‌ను లుక్‌ను బట్టి కాకుండా.. బిర్యానీ టేస్ట్‌ను బట్టి అంచనా వేయాలంటున్నారు అక్కడి ప్రజలు. షార్జాహ్‌లో రుచికరమైన హైదరాబాద్ బిర్యానీని అందించే భోజన ప్రియుల మన్ననలను పొందుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ రెస్టారెంట్ సేవలను అందిస్తుంది. ఒక్కో బిర్యానీ 15 దిర్హమ్స్(263 రూపాయలు) ఉంటుంది.

చిరునామా: Opposite St Michael's Church, Al Yarmook, Halwan Suburb, Sharjah, Contact 06 5671667.

2. పాక్ లియారీ (Pak Liyari): దుబాయిలో పాకిస్తానీ రెస్టారెంట్స్‌లో అత్యుత్తమమైనది ఈ పాక్ లియారీ రెస్టారెంట్. స్పైసీ స్పైసీ బిర్యానీ ఇక్కడి ప్రత్యేకత. 12 దిర్హమ్స్ (201రూపాయలు) ధరతో బిర్యానీలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకూ ఈ రెస్టారెంట్ అందిస్తుంది.

చిరునామా: Behind Gulab Building, Al Fahidi Street, Meena Bazaar, Dubai, Contact 04 3535587.

3. గ్రూబ్ షేక్ (Grub Shack): దుబాయిలో బొంబాయి, గోవా వంటి పరిసర ప్రాంతాల ఆహార పదార్థాలను అందించే ఇండియన్ రెస్టారెంట్‌గా గ్రూబ్ షేక్ పేరు తెచ్చుకుంది. ఇక్కడ అన్ని ఆహార పదార్థాల కంటే బిర్యానీ చాలా సూపర్ అని అందరూ అంటుంటారు. 25 దిర్హమ్స్(439 రూపాయలు) ధరతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ సర్వీసులను అందిస్తుంది ఈ రెస్టారెంట్.

చిరునామా: Building 41, Next to Dubai Healthcare City Metro Station, Contact 04 4489095.

4. జఫెర్ భాయ్(Jaffer Bhai): దుబాయిలో చాలా రద్దీగా ఉండే రెస్టారెంట్లలో జఫెర్ భాయ్ రెస్టారెంట్ ఒకటి. భారతీయ బిర్యానీ స్పెషల్స్‌కు ఈ రెస్టారెంట్ ఫేమస్. 25 దిర్హమ్స్ (439 రూపాయలు) ధరతో వెరైటీ వెరైటీ బిర్యానీలను అందించే ఈ రెస్టారెంట్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ సర్వీసులను అందిస్తుంది.

చిరునామా: Building 41, Next to Dubai Healthcare City Metro Station, Contact 04 4489095.

5. సైఫ్ రెస్టారెంట్ (Saif Restaurant): చికెన్, మటన్ కాంబినేషన్లతో వెరైటీ వెరైటీ బిర్యానీలను అందిస్తుంది సైఫ్ రెస్టారెంట్. స్పైసీ స్పైసీ బిర్యానీలు ఇక్కడ ప్రత్యేకత. 10 దిర్హమ్స్ (175 రూపాయలు) ధరతో బిర్యానీలను అందించే ఈ రెస్టారెంట్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ సర్వీసులను అందిస్తుంది.

చిరునామా: Opposite Hor Al Anz Mosque, Hor Al Anz, Dubai, Contact 04 2662811.