//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో రాజ్ తరుణ్....అది కూడా సీక్రెట్ లవర్ తో...?

Category : movies

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వతహాగా ఎదిగిన యంగ్ హీరోల్లో ఒకరు ప్రముఖ నటుడు రాజ్ తరుణ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటు వంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్ట పడి పైకొచ్చిన నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిల్మ్స్ నుండి వెండి తెరపైకి దూసుకొచ్చిన రాజ్ తరుణ్... మొన్నా ఆ మధ్య ఏపుడో ప్రేమలో పడ్డాడట.ఏకంగా ఆరు సంవత్సరాల నుండి తాను ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.తాజాగా ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ ఈ ఆసక్తి కరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన ప్రేమ వ్యవహారంపై రాజ్ తరుణ్ మాట్లాడుతూ......గత కొన్నేళ్లుగా వారిద్దరు ప్రేమించు కుంటున్నట్లు చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్.తన ప్రేమ విషయం బయటకు రావడం తనకు ఇష్టం లేదనీ.. ఆమె ఎవరు అనే విషయాన్ని చెప్పి ఆమె ప్రైవసీకి భంగం కలిగించడం తనకు ఇష్టం లేకనే ఇన్నాళ్లూ ఈ వ్యవహారం దాచి ఉంచి నట్లు రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే త్వరలోనే వారిద్దరూ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నట్లు. పుల్ క్లారిటీ గా చెప్పేశాడు.ఇంతకీ మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది అని అడిగిన ప్రశ్నకు....సమాధానం గా సరిగ్గా 6 ఏళ్ల క్రితం తన బర్త్ డే వేడుకలు ఆమెను కలవడం జరిగింది. అప్పుడే నా అభిరుచులు ఆమె అభిరుచులు కలిసాయని. ఆ తర్వాత తమ ఇద్దరి మద్య స్నేహం బలపడి.... ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందనీ రాజ్ తరుణ్ వివరించారు. విజయవాడకు చెందిన ఆమె వ్యాపారం నిర్వహిస్తుందని .ఆమె పేరు.. ఆమె గురించిన మరిన్ని విషయాలను చెప్పేందుకు ఇష్టపడని రాజ్ తరుణ్... ఇండస్ట్రీకి ఆమెకు సంబంధం లేదని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఇక ప్రస్తుతానికి అయితే హీరోగా రాజ్ తరుణ్ స్ట్రగుల్ అవుతున్న సంగతి తెలిసిందే... ఇక పెళ్లి అయిన తర్వాత అయిన మనోడికి లక్ కలిసి వచ్చి సక్సెస్ లు వస్తాయేమో చూడాలి మరి.