Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ హీరో అంటే మోజు పెంచుకున్న " గే " లు .....ఆ పాత్రలో అతన్ని చూసినప్పటి నుంచి అతనంటే పడి చస్తునారట.

Category : movies

సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్స్ అంటే చాలా మంది కి ఓ రకమైన అవినాభావ సంబంధం ఉంటుంది.అందులో కొందరైతే తమకు నచ్చిన నటులకోసం ఏమైనా చేయడానికి సిద్ధ పడే హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో కొందరు వారిని ఆరాధిస్తే.... మరికొందరు వారిని గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు.అయితే తాజా ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పై ఇదే రకమైన ఫ్యాన్స్ వార్ మొదలైంది.అందులో కొందరు ఆ నటుడు అంటే ఇష్ట పడుతుంటే... ఇంకొందరు పిచ్చి పిచ్చి కామెంట్స్ తో తెగ రెచ్చ గొడుతున్నారు.ఆ నటుడు ఎవరో కాదు ప్రముఖ హిందీ నటుడు అర్జున్ మాథూర్.ప్రస్తుతం ఈ నటుడు అంటే అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా పడిచచ్చిపోతున్నారట. మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ జీవిత కథ ఆదరంగా తెరకెక్కిన మూవీ " ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌". ఈ సినిమాలో మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటించగా.. రాహుల్ గాంధీగా పాత్రలో అర్జున్ మాథూర్ నటించారు.అయితే రాహుల్ పాత్రలో నటించిన అర్జున్ నటనకు మంచి గుర్తింపు లభించింది.

అయితే ఆ మూవీ తర్వాత అర్జున్ ‘ మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇందులో ఆయన ఓ స్వలింగ సంపర్కుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. అయితే ఆ పాత్ర లో నటించిన అర్జున్ పై గేలు అంతా మనసు పడ్డారు.అర్జున్ మాథూర్‌ కూడా తమలా ఓ 'గే' అనుకొని చాలామంది అబ్బాయిల కూడా ఆయనకు మెసేజ్‌లు,ఫోన్ లు చేస్తూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. కొందరైతే అతనికి చాలా అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్నారని. మరకొందరు తనను తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారని నటుడు అర్జున్ వాపోయాడు. తాను అటువంటి వాడిని కాదని చెప్పినా వారు వినడం లేదని.... ఇలా ప్రతి రోజూ తనతో అసభ్య కరంగ ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందులో కొందరు మాత్రం తనను ప్రశంసిస్తూ, ఈ సిరీస్ విడుదలైన తరువాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని కొందరు స్వలింగ సంపర్కులు అన్నారని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. తాను తెరపై నటించే పాత్రలను, తన నిజ జీవితాన్ని కలిపి చూడవద్దని అర్జున్ నెటిజన్లను, తన అభిమానుల్ని ఉద్దేశిస్తూ విజ్ఞప్తి చేశారు. మరి అర్జున్ చేసిన ఈ విజ్ఞప్తి పై వారంతా ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News