అమెరికాలోని డల్లాస్ పట్టణం వాసులకు అర్థరాత్రి నిద్రలేకుండా చేశాడు ఒక హ్యాకర్. ప్రభుత్వ అత్యవసర సేవల వ్యవస్థను హ్యాక్ చేసిన ఆ దుండగుడు, ఒకేసారి 156 అత్యవసర సైరన్లను మోగించాడు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు డల్లాస్ నగరంలో ఈ సైరన్లను ఏర్పాటు చేశారట. కంప్యూటర్ సిస్టంతో అనుసంధానమై ఉండే ఈ సైరన్లను కార్యాలయం నుంచే మోగించే వీలుంటుందట. అయితే ఆ వ్యవస్థను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్. అలా అన్నింటినీ ఒకేసారి మోగించాడని అధికారులు చెబుతున్నారు.నిమిషం కాదు, రెండు నిమిషాలు కాదు ఏకంగా గంటన్నరపాటు అది కూడా అర్థరాత్రి సమయంలో సైరన్లను మారుమోగించాడు. దాంతో ఏం జరిగిందో తెలియక డల్లాస్ పట్టణ వాసులు బెంబేలెత్తిపోయారు.రాత్రి 11.42 నుంచి అర్థరాత్రి 1.17వరకు ఏకదాటిగా 60సార్లు సౌరన్లను మోగించాడట హ్యాకర్.అధికారులు ఇది హ్యాకింగ్ దాడిగా గుర్తించారు కానీ, ఇప్పటికీ హ్యాకర్ ఎవరన్నది మాత్రం కనిపెట్టలేకపోయారు. ఏదిఏమైనా అర్ధరాత్రి డల్లాస్ ప్రజల వాసులకు దడపుట్టించాడు ఆ హ్యాకర్ కేటుగాడు.