శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రిపై గురువారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ధనుంజయ తండ్రి రంజన్ అలియాస్ మహథున్(62) ప్రాణాలు కోల్పోయారు. రంజన్ జ్ఞానేంద్ర రోడ్లో(సీ బీచ్ రోడ్) ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఆయన మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ప్రత్యర్థులే కక్ష కట్టి ఇలా చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తండ్రి మరణంతో వెస్టీండీస్ టూర్ నుంచి ధనుంజయ తప్పుకున్నాడు.