//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీ నుంచి ముంబైల మధ్య అత్యంత వేగంగా నడిచే కొత్త స్పెషల్ రాజధాని ఎక్స్ ప్రెస్‌

Category : national

దేశ రాజధాని నగరమైన ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని అయిన ముంబైల మధ్య అత్యంత వేగంగా నడిచే కొత్త స్పెషల్ రాజధాని ఎక్స్ ప్రెస్‌ను నడపాలని నిర్ణయించింది. 

సోమవారం నుంచి నడిపే ఈ ప్రత్యేక రాజధాని ఎక్స్ ప్రెస్ కేవలం కోట, వడోదర, సూరత్ రైల్వేస్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

ఇప్పటికే ఢిల్లీ- ముంబై నగరాల మధ్య రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్, 30 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.

ఈ ప్రత్యేక రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణ సమయాన్ని రెండు గంటలు తగ్గించనున్నారు.

రెండు లోకోమోటివ్ ఇంజన్లతో వేగంగా నడిచే ఈ ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను వారానికి మూడురోజులపాటు నడుపుతామని రైల్వే అధికారులు వెల్లడించారు.