//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి.. పార్టీ మారేందుకు సిద్ధమైన నేతలు

Category : national

బీజేపీ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనకు ఉద్వాసన పలికేందుకు యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్న శోభాకరంద్లాజె కారణమని సదానందగౌడ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శోభా సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న సదానందగౌడకు రెండు పదవులు ఇవ్వడం సరికాదని ఇటీవల జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో శోభాకరంద్లాజె తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు సమాచారం. పార్టీ ఇన్‌చార్జి ప్రకాష్‌ జవడేకర్‌ కూడా ఇందుకు ఆమోద ముద్రవేయడంతో ఈ బాధ్యతను యడ్యూరప్పే చేపడతారంటూ ఇటీవల పార్టీ అధికారికంగా ప్రకటించిన సంగతి విదితమే. ప్రచార కమిటీలో కేంద్ర మంతి సదానందగౌడ కేవలం సభ్యునిగా వ్యవహరిస్తారు.

ఇప్పటికే శోభాకరంద్లాజెకు మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌.అశోక్‌కు మధ్య గొడవలు తీవ్రం కావడంతో శోభా వద్ద ఉన్న నవ కర్ణాటక నిర్మాణ ర్యాలీ బాధ్యతలను శోభా నుంచి తప్పించి అశోక్‌కు అప్పగించారు. సంగొళ్ళిరాయణ్ణ బ్రిగేడ్‌ విషయంలో విధానపరిషత్‌లోని ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్పతోనూ బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పకు అభిప్రాయబేధాలు కొనసాగుతున్నాయి.

పార్టీలో శోభాకరంద్లాజె, యడ్యూరప్పల ఒంటెద్దు పోకడలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్‌ నేతలంతా ఏకమవుతుండటం వీరిలో కొందరు కాంగ్రెస్‌ లేదా జేడీఎస్‌లో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుండటం సర్వత్రా కుతూహలం రేకెత్తిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీలో అసమ్మతి మళ్ళీ రాజుకోవడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. దీనిని ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటోంది. ఇది ఏ మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.