Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వర్షానికి 22 మంది ముంబై వాసుల మరణం

Category : editorial

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై వర్షాలకు హతలాకుతలం అవుతుంది, కాని ఈ విషయం మనకు ఏ దినపత్రికల్లో కానీ.. టీవీ ఛానళ్లలో కానీ పెద్దగా కనిపించకపోవటం గమనార్హం. గురువారం నుండి ఎడతెరపిగా కురుస్తున్న వర్షం వలన ముంబయిలోని జనజీవనం స్తభించటమే కాకుండా, లోతట్టుప్రాంతాలు తటాకాలు మాదిరి మారిపోయాయి. సగటు జీవి బతుకు చిత్రం చిన్నాభిన్నమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే. ఈ వర్షం కారణంగా వివిధ ప్రాంతాలలో చోటుచేసుకున్న సంఘటనల కారణంగా ఏకంగా 22 మందికి పైగా మరణించారు. పెద్ద పెద్ద తుఫానుల సందర్భంలోనే ఇంత భారీగా మృత్యువాత పడింది లేదు, కాని ఇప్పుడు ఎడతెరపిగా కురుస్తున్న వర్షం కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాల కారణంగా ముంబయి మహానగరంలోని అనేక చోట్ల గోడలు, పాడుబడ్డ భవనాలు

కూలిపోవటమేకకుండా, ప్రాణాలు పోయే సంఘటన చోటు చేసుకుంది.పెద్ద ఎత్తున గాయాలు అయ్యే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే పలు రైళ్లను, విమాన సర్వీసులు రద్దు చేశారు. ముంబయికి రావాల్సిన పలు విమానాల్ని దారి మళ్లించారు. మంబయి నగరంలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో పింపరీపాడ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో ఏకంగా 13 మంది మృత్యువాత పడ్డారు. మరో 13 మంది గాయపడ్డారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు స్పందించి. అక్కడకు సిబందీ బృందాలు చేరుకునే లోపే స్థానికులు రియాక్ట్ అయి శిధిలాల్లో కూరుకుపోయిన వారిని రక్షించటంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. విడవకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉన్న వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.