//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో దెబ్బకి టెలికాంలో 10లక్షల ఉద్యోగులు ఇంటికి?

Category : business

రిలయన్స్ జియో దెబ్బతో మిగితా టెలికాం సంస్థలు భారీగా దెబ్బ తింటున్నాయి అనే సంగతి తెలిసిందే, జియో దెబ్బకు మిగితా టెలికాం సంస్థలు ఎంతలా దెబ్బ తింటున్నాయి అంటే, గత మార్చితో ముగిసిన 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో దేశియ టెలికాం సంస్థల రాబడి రూ. 1.93లక్షల కోట్లున్న టెలికాం సంస్థలు ఆదాయం 2016- 17 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.88లక్షల కోట్లకు తగ్గింది. అయితే ముందు ముందు ఆర్థిక సంవత్సరాలలో రాబడి మరింత తగ్గుతుందని బ్రోకరేజ్ సంస్థ "సి.ఎల్.ఎస్.ఎఫ్" ఒక నివేదికలో పేర్కొంది. 

టెలికాం సంస్థ రాబడులే కాకుండా మార్కెట్ లో జియో ప్రవేశంతో దేశియ టెలికాం రంగంలో 10లక్షలకు మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని ఆ సంస్థ అంచనా, టెలికాం సంస్థల ఆదాయాలు గణనీయంగా తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు గడిచిన ఆరు నెలల్లో దాదాపు 3,400 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అత్యంత తక్కువ ధరలో డేటా, ఉచితంగా వాయిస్ కాల్స్ అనే జియో ఆఫర్లతో, మిగితా టెలికాం సంస్థలు తమ వినియోగదారులకోసం టారిఫ్ లు తగ్గించక తప్పలేదు. దాంతో సంస్థల రాబడులు, లాభాలపైనా భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి పెద్ద టెలికాం సంస్థలు ఏదోలా నెట్టుకొస్తున్నాయి కానీ చిన్నా చితక సంస్థలు జెండా ఎత్తివేసే స్థితికి చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఈ పరిణామాలతో మున్ముందు దేశియ టెలికాం రంగంలో మూడు, నాలుగు సంస్థలకు మించి నిలబడలేక పోవచ్చునని విశ్లేషకులు బావిస్తున్నారు.ఏది ఎమైన రిలయన్స్ జియో దెబ్బ టెలికాం ఉద్యోగుల మీద బారీగా పడనున్నదని చెప్పవచ్చు.