ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎమిరేట్స్ ను మొదటిసారి హైదరాబాద్ తీసుకొచ్చేనెదుకు చంద్రబాబు నాయుడు చూపిన చొరవను గుర్తుచేసుకున్న అద్నాన్.
ఆంద్రప్రదేశ్ ను ఎమిరేట్స్ హబ్ ఏర్పాటుకు మన బంధం మరింత దృఢ పర్చుకుందాం.
ఎమిరేట్స్ ఏపీని ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హిబ్ గా తయారు చేసుకోవచ్చు.
ఆంద్రప్రదేశ్ భౌగోళికంగా మధ్య ప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉంది.
అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్ కి అనుసంధానం చేయొచ్చు.
ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలు కల్పించేందుకు ఏపీలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
ఆంద్రప్రదేశ్ లో ఒక విమానాశ్రయం నిర్మించండి.
మాకు ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్స్, పోర్ట్స్ ల ప్రతినిధుల బృందంతో ఒక టాస్క్ ఫోర్స్ ఉంది.
ఇరువురం సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పని చేద్దామని ముఖ్యమంత్రి కి ప్రతిపాదించిన ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్.