//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ పైసా తగ్గిస్తే ఆ ముఖ్యమంత్రి రూపాయి తగ్గించారు

Category : national politics

నరేంద్ర మోడీ పాలనలో తగ్గుతుంది అనుకున్న పెట్రోల్ ధరలు భారిగా పెరిగిపోయాయి. దీనితో వాహనాలు నడపాలి అంటేనే వినియోగదారులు వణికిపోతున్నారు. అయితే తాజాగా మోడీ ప్రభుత్వం జాలి చూపించి ఒక పైసా ధరను తగ్గించింది. దీనిపై పలువురి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్ ధరను ఏకంగా రూపాయి తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్పించారు.

కేరళ ప్రభుత్వం వినియోగదారులపై భారం తగ్గించేందుకు తమ వంతుగా ముందుకు వచ్చింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు ఒక రూపాయి చొప్పున తగ్గించాలని పినరయి విజయన్ సర్కార్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలకు పగ్గాలు వేసే విషయంలో పక్షం రోజులుగా మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, కేరళ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.