చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తాతయ్యారు. ఈరోజు ఆయనకు మనుమరాలు పుట్టింది. ఈ సందర్భంగా, అప్పుడే పుట్టిన మనుమరాలిని ఎత్తుకుని ఆయన మురిసిపోయారు. తన తనుమరాలితో కలసి దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భగవంతుడి అనుగ్రహంతో తమ ఇంటికి మనుమరాలి రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని, మనుమరాలిని ఎత్తుకోవడానికి మించిన ఆనందం తాతగా తనకు మరేదీ లేదని ఆయన ట్విట్టర్లో తెలిపారు.