//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపించిన కేంద్రం

Category : politics

కేంద్రం సాధారణ బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపించింది, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే పని చేసింది.

పాత మార్గాలకు అరకొర నిధులు తప్ప, కొత్త మార్గాలను ప్రకటించలేదు. అమరావతికి అత్యంత కీలకమైన రైల్వే లైన్, విజయవాడ - గుంటూరు వయా అమరావతికి రూ. 3,272 కోట్ల అంచనా వ్యయం కాగా, బడ్జెట్ లో కేవలం రూ. 10 కోట్లు విదిల్చారు. ఇక ఈ ప్రాజెక్టు లాభసాటి కాదని భావిస్తున్నామని, నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రం భరించాలని రైల్వే శాఖ కోరింది.

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేయడంతో, ఈ మార్గం ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు. ఇక ఒక్క కొత్త మార్గాన్నీ మంజూరు చేయని కేంద్రం, గతంలో సర్వేలు పూర్తి చేసిన కొత్త లైన్లపైనా ఒక్క మాట మాట్లాడలేదు. హైదరాబాద్ నుంచి చెన్నైకి దూరాన్ని తగ్గించే నడికుడి - శ్రీకాళహస్తి మార్గానికి రూ. 420 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. ఈ మార్గంలో పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకూ 28 కిలోమీటర్ల దూరాన్ని ఈ సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.

నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఓబులవారి పల్లి - కృష్ణపట్నం, విజయవాడ - గూడూరు మూడోలైన్ కు కొంతమేరకు కేటాయింపులు జరిగాయి. మొత్తం మీద 2017-18లో ఇచ్చిన నిధులతో పోలిస్తే, ఈ సంవత్సరం 8 శాతం అదనపు కేటాయింపులు జరిపినప్పటికీ, కొత్త లైన్లు, రైళ్లు లేకపోవడం, డిమాండ్ మేరకు ఫ్రీక్వెన్సీ పెంపు వంటి నిర్ణయాలు వెలువడకపోవడం నిరాశ కలిగిస్తోంది.

Related News