//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్రం మరో బ్యాక్ స్టెప్

Category : national

జీఎస్టీ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. తాజాగా పన్ను చెల్లింపుదారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ గడువులోగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారికి విధించిన ఫైన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 'పన్ను చెల్లింపుదారులకు సులభంగా ఉండేలా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్‌పై ఆలస్యపు రుసుమును మాఫీ చేశాం.. చెల్లించిన లేట్ ఫీజులను పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో తిరిగి జమచేస్తాం' అంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు అక్టోబర్ 20 చివరితేదీగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.