//single page style gallary page

The BJP's attempt to mobilize the Congress-JDS government.

Category : politics

Click here to read this article in Telugu

కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నం.

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో గత ఎన్నికలు ఎవరు మరచి పోలేరు .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి త్వరలోనే మిత్రపక్షం నుంచి గట్టి షాక్ తగిలే ఆస్కారం ఉంది.ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల్లో..... సుమారు పది మంది వరకు సొంత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నరనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తుంది. మొదటి నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేతలు పెద్ద సమస్యగా మారారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్యపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ పలు సార్లు ఆరోపించారు.అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోషన్ బేగ్ - రామలింగారెడ్డి కూడా ఆ పార్టీ పెద్దలపై అలక బునారు .ఈ నేపధ్యంలోనే వారు బహిరంగ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

వీరికి తోడు మాజీ మంత్రి రమేశ్ జార్కి హోళి తనదైన శైలితో తమ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు మరికొందరితో కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటామని గతంలోనే చెప్పారు. అంతేకాకుండా ఈనెల 9వ తేదీన వారంతా బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని సమాచారం. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరికి కేబినెట్ లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఈక్రమంలో తమకు అన్యాయం జరుగుతుందని భావించిన నేతలు మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి నేతృత్వంలో ఈనెల 8వ తేదీ సమావేశమై 9వ తేదీ రాజీనామా చేస్తారని సమాచారం.లోక్ సభ ఫలితాల నాటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

అయితే ప్రభుత్వాన్ని కాపాడేందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య రంగంలోకి దిగి బుజ్జగించారు.కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. ప్రస్తుతం జేడీఎస్ 37 - కాంగ్రెస్ 79 కలిపి 116 మంది ఉన్నారు. అయితే ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున పాలక పక్షానికి ప్రస్తుతం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంచనా. అయితే ఉన్నఫలంగా 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అని తెలుస్తుంది. దీనికి తోడు బీజేపీ ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. మరో 10 నుంచి 12 మంది చేరితే ఆ సంఖ్య 117 కు చేరుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సులభం అయినట్లే నని చెప్పవచ్చు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని ఈ రకంగా అంచనా వేస్తున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.ఇదే జరిగితే ఆ రెండు పార్టీ లకు భారీ షాక్ తప్పని సరి.

The last election in the state of Karnataka politics can not be forgotten .Though the Congress-JDS-led coalition government has a strong shock from the ally of the alliance. In the present situation, some of the Congress MLAs have been forced to resign from their own party, The campaign is going on . If that happens, the collapse of the coalition government seems to be almost the same. Congress leaders have been a big problem for the coalition government since the beginning. JDS state president H.Vishwanath has alleged several times over CEP leader Siddaramaiah. Senior Congress leaders Roshan Baeg-Ramalinga Reddy also said that the party elders were not in the public opinion.

Former minister Ramesh Jharkhand has expressed their disagreement with his own style. In the past, he said that he would resign and join the BJP with the others. Also, on the 9th of this month, Mukhuram has also been informed that the BJP is to join the BJP. Besides the two independent MLAs, the senior Congress MLA will give a place to the cabinet to save the coalition government. Leaders who think that they will be unfair in this case will be led by former minister Ramesh Jharkhalli on 8th this month and will resign on 9th. The coalition government has been worse since the Lok Sabha elections.

But the former Chief Minister Siddaramaiah came out of the field to save the government. The creation of government in Karnataka will require 113 MLAs. Currently JDS 37 - Congress has 79, including 116. But as the two independent MLAs are currently supporting the government, the ruling party is currently supporting 118 MLAs. However, the result of the 10 MLAs resigns will be the collapse of the government. In addition, the BJP now has 105 MLAs. The number of 10 to 12 people will reach number 117. As a result, the way the government has made it easier is to say. The political analysts are predicting this will collapse with the coalition government. If this happens, it will be a big shock for the two parties.