రానున్న విజయదశమి సందర్భంగా ఎపి ప్రభుత్వం స్కూళ్లకు సెలవులను వెల్లడించింది.
దసరా సందర్భంగా అక్టోబర్ 9 నుండి 21వ తేదీ వరకూ స్కూళ్లను మూసివేస్తున్నట్లు జివొ విడుదల చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నామని, తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని తెలిపింది.
21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఎపి సర్కారు జివొలో పేర్కొంది. దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి