//single page style gallary page

That's why. S Jagan Cm as Minister of Cabinet Expansion from Srikakulam

Category : politics

Click here to read this article in Telugu

వై. ఎస్ జగన్ సీఎం గా ఏపి మంత్రి వర్గ విస్తరణ మంత్రులుగా శ్రీకాకుళం నుంచి మొదలు....!

ఏపీ క్యాబినెట్లో కొలువు తీరబోతున్న మంత్రి వర్గ విస్తరణ లో నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం వెలగపూడిలోని ఏపి సచివాలయం ప్రాంగణంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో మొదటగా ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు ప్రమాణం చేశారు.ఆ తరువాత సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో అప్పలనాయుడునీ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ అయిన నరసింహన్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.49 నిమిషాలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ముందుగా క్యాబినెట్‌లో చోటుదక్కిన వారి పేర్లను ప్రకటించిన ఆయన.... వారితో పదవీ స్వీకార ప్రమాణం, రహస్య పరిరక్షణ ప్రమాణం చేయాలని సూచించారు.

మొదటగా శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే లుగా గెలిచిన అభ్యర్థులను మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు . ఆ తదుపరి క్యాబినెట్‌లో చోటుదక్కిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్ తొలి మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత విజయనగరం జిల్లా చీపురపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, కురపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు లతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎమ్మెల్యే పినిసే విశ్వరూప్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ వద్దకు వెళ్లి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.వీరి అనంతరం కృష్టా జిల్లాకు చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత మంత్రులుగా ప్రమాణం చేశారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌లతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వామి మంత్రిగా ప్రమాణం చేశారు.

Ministers who sworn in today's Cabinet expansion ministerial expansion in the cabinet. This swearing-in ceremony was completed in the AP Secretariat premises in Vellalpudi. Babu Bala MLA Shambangi Venkata Appalanayudu was the first speaker speaker at the event. Later Narasimhan, the governor of the Telugu state of Andhra Pradesh, was sworn in the first block of the Secretariat. According to a preliminary forecasts, Governor Narsimhanan started the swearing-in ceremony of the ministers at 11.49 am. Earlier, he announced the names of the people in the cabinet ... he said that they should take the swearing-in swearing and secret conservation criterion.

Initially, the candidates who won the MLA from Srikakulam were sworn in ministers. Krishna Das was the first MLA of Narasanpet MLA in Srikakulam district in the next cabinet. Later, Governor Narsinghin was sworn in with Bimila Satyanarayana MLA from Chiruparappilly district, Kuruppam MLA Snam Pulappu Srivani and Vishakhapatnam district secretary Muthanthaseeti Srinivasa Rao. He was later sworn in as the MLA of the Kakinada Rural MLA Kurasala Kannababu, MLC Cat Subhash Chandra Bose and Amalalur MLA Pinissa Vishwaroop. After the swearing-in ceremony, Subhash Chandra Bose came to Jagan and became emotionally disturbed. Afterwards, Gudivada MLA from Kuda district, Kodali Shrivenskeswarar Rao (Nani), Machilipatnam MLA Purni Venkatramayya.

Eluru MLA of the West Godavari district, and the MLA of Chekuruvada Sriranganathu Raja and the Kovvur MLA, were sworn in as ministers. Vijayawada West MLA Vellampalli Srinivas was sworn in as Governor. Pettipadu MLA of Guntur district, Mekkotti Sudhirya, Mopidevi Venkataramanam, Prakasam district Ongole MLA Balineni Srinivas Reddy and Yeragoddapalem MLA Srinivas swearing as ministers. Nellore Rural MLA Anil Kumar Yadav and Athuraku MLA Mekapati Gautam Reddy were sworn in by the Governor. Chintur district Punganuru MLA Pendireddy Ramachandra Reddy, Gangadhar Nellore MLA K. Narayanaasamy sworn as Minister.