Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఎమ్మెల్యే ఆస్తులే 730 కోట్లు

Category : politics national

దేశంలో బిజెపి అన్ని రాష్ట్రాలు ఎలా చేజక్కించుకుంది అంటే దానికి కారణం అమిత్ షా అనే చెప్తారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి రాజకీయ౦లో ఎవరికి అందని ఎత్తులో అమిత్ షాని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధి సైతం ఎన్నో సందర్భాల్లో విఫలమై అధికారాన్ని వదులుకున్నారు. కాని అలాంటి అమిత్ షాని ఎదుర్కొవడంలో ఏ మాత్రం తడబాటు చూపలేదు ఒక వ్యక్తి. బిజెపిని కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బోల్తా కొట్టించడంలో పూర్తి స్థాయిలో సఫలమైన ఆ వ్యక్తి ఎవరో కాదు...

డీకే శివకుమార్... మాజీ మంత్రి. బిజెపిని ఎదుర్కోవడంలో పూర్తి స్థాయిలో సఫలమయ్యారు. ఆయన రాజకీయ చాణక్యత తెలిసిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను అప్పగించింది. దీనిని శివకుమార్ సమర్ధవంతంగా నిర్వహించారు. శివకుమార్ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడం ఇదేం తొలిసారి కాదు. 2002లో కాంగ్రెస్ నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించడం...

వారిని మళ్లీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అవిశ్వాసం రోజు ముంబైకి తరలించి.. తీర్మానాన్ని నెగ్గేలా చేయడంలో శివకుమార్‌ ముఖ్య పాత్ర పోషించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంలో గుజరాత్‌కు చెందిన 44మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు లొంగకుండా కాపాడటంలో శివకుమార్ కీలకంగా మారారు. అయితే, ఈ ఘటన జరిగిన వారం రోజులకే శివకుమార్‌కు చెందిన 64 ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జరిగాయి. శివకుమార్ సంపన్న రాజకీయ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎన్నికల సంఘానికి ఆయన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ లెక్కల ప్రకారం ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద మొత్తం కలిపి ఉన్న ఆస్తుల విలువ రూ.730కోట్లు. ఆయన సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో నిజాయితీ కలిగిన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాతికేళ్ల వయసులో దేవెగౌడపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 1983-85 మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1989లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎస్ బంగారప్ప కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా పనిచేశారు.