//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఎద్దు ఖరీదు అంతా...!

Category : state

కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలోని ఒక ఎద్దు 5 .25 లక్షల రేటు పలికింది. విషయానికి వస్తే అలంసాగారి మౌలాలి అనే రైతు 18 నెలల క్రితం రూ.90 వేలకు ఒంగోలు గిత్తను కొనుగోలు చేశాడు. బుధవారం దానిని రూ.5.25 లక్షలకు అమ్ముకున్నాడు. దీంతో రూ.4.35 లక్షల ఆదాయం తెచ్చిపెట్టిందని అయన అన్నారు.

దీనిని కడప జిల్లా మైదుకూరు మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి అనే రైతు కొనుగోలు చేశాడు. ఈ ఒంగోలు గిత్త రాష్ట్రస్థాయిలో మూడు బండలాగుడు పోటీల్లో ప్రథమ స్థానంలో, రెండు ద్వితీయ స్థానాల్లో గెలుపొంది పలువురి మన్ననలు పొందింది. దీంతో రూ.4.35 లక్షల ఆదాయం వచ్చింది.

Related News