//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అన్నయ్య ఋణం తీర్చుకోబోతున్నాడా ....!

Category : movies

మరోసారి తన అన్న సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు సంగీత దర్శకుడు థమన్. అన్న అన్నామని ఎవరో అనుకుంటారేమో ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ . థమన్ ఎన్టీఆర్ ని ముద్దుగా అన్న( అన్నయ్య ) అని పిలుస్తుంటారు. థమన్ మరియు ఎన్టీఆర్ కి మధ్య మంచి సన్నిహితం ఉంది. థమన్ మణిశర్మ దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసిన విషయం అందరికి తెలిసిందే . పైగా మణిశర్మ కూడా ఎన్టీఆర్ సినిమాలకి సంగీతాన్ని అందించే సమయంలో థమన్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగేవాడు . ఇక థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రవితేజ కిక్ సినిమాకి మంచి కిక్ ఇచ్చే సంగీతాన్ని అందించాడు. తన తోలి చిత్రం తోనే తానేంటో టాలీవుడ్ కి వినిపించాడు.

కానీ , తనకి మొట్టమొదటగా ఒక స్టార్ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్ యే అని చెప్పాలి . అది సాహసమే అని చెప్పాలి .సాదారణంగా స్టార్ హీరోస్ ఎవరు కొత్తవాలన్నీ ప్రోత్సహించడానికి సాహసించరు . కానీ ఎన్టీఆర్ కి థమన్ మీద ఉన్న నమ్మకంతో తాను నటించిన బృందావనం లాంటి క్లాస్ మూవీ కి అవకాశం ఇచ్చాడు. ఇక తాను ఇచ్చిన ఈ అవకాశంతో థమన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆనతి కాలం లోనే టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు.

థమన్ కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చి , థమన్ అంటే ఇది ప్రూఫ్ చేసిన తరువాతె మహేష్ , చరణ్ లాంటి స్టార్ లు అవకాశం ఇచ్చారు. ఇక అద్భుతమైన కెరియర్ ఇచ్చిన ఎన్టీఆర్ అన్నయ్యకి మర్చిపోలేని సంగీతాన్ని కానుకగా ఇచ్చి తన ఋణం తీర్చుకున్నాడు అనుకునేలా మొన్న రిలీజ్ అయిన అరవింద సమేత ...టీజర్ తో నిరూపించుకున్నాడు . విషయమేమిటంటే టీజర్ గురించి ఎంతమంది మాట్లాడుకున్నారో ...నేపధ్య సంగీతం గురించి సోషల్ మీడియా లో అంతకంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . ఈ నేపధ్య సంగీతం చుసిన ఎన్టీఆర్ అభిమానులు , పాటలు దీనికి మించేలా ఉంటాయని , దానికి ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్స్ తో ధియేటర్ లు దద్దరిల్లి పోవటం ఖాయమని ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు .