టెస్టులకు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ముందడుగు వేసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఐసీసీ ఆమోదం తెలిపింది. 4 రోజుల టెస్టు మ్యాచ్‌ల ప్రయోగాలను ఆయా దేశాలు చేపట్టొచ్చని ఐసీసీ పేర్కొంది.ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ అక్లాండ్లో మీడియాతో మాట్లాడారు. 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం ఈ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఫైనల్‌ను 2021లో నిర్వహిస్తామని చెప్పారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో 9 దేశాలు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆడతాయని వివరించారు. రెండేళ్లపాటు జరిగే ఛాంపియన్‌షిప్‌లో 9 దేశాలు మొత్తం ఆరు సిరీస్‌లు ఆడుతాయని పేర్కొన్నారు. మూడు సిరీస్‌లు స్వదేశంలో, మరో మూడింటిని బయటిదేశాల్లో ఆడతాయన్నారు. సిరీస్‌లో కనిష్ఠంగా రెండు మ్యాచ్‌లు.. గరిష్ఠంగా ఐదు మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. టాప్‌లో నిలిచిన రెండు దేశాలు ఏప్రిల్ 2021లో జరిగే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడతాయన్నారు.