//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు నేతృత్వంలోనే తృతీయ ఫ్రంట్..?

Category : state national

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు. దీనితో ఇప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది సర్వత్రా ఆశక్తి నెలకొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డియే నుంచి బయటకు రావడంతో ముస్లిం వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాయి.

అలాగే చంద్రబాబు ఎన్డియే నుంచి బయటకు రావడాన్ని అటు జాతీయ స్థాయి నేతలు కూడా సానుకూలంగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనితోనే మోడిపై యుద్ధం అని చంద్రబాబు అనగానే అవిశ్వాసానికి అనేక పార్టీలు మద్దతు పలికాయి. ఈ నేపధ్యంలోనే తృతీయ ఫ్రంట్ అనే దానికి కాస్త ఊపు లభించింది. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీలో మకాం వేసారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

జాతీయ స్థాయి నేతలకు చంద్రబాబు తో మంచి పరిచయాలే ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఇతర నేతలనే ఏక తాటిపైకి తీసుకురాగల సత్తా ఉన్న నేత. దీనితో ఆయన నేతృత్వంలోనే తృతీయ ఫ్రంట్ ఊపిరి పోసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కాగా చంద్రబాబు ఈ సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సమాజ్‌వా దీ పార్టీ ముఖ్యనేత ములాయంసింగ్‌ యాద వ్‌,

బీఎస్పీ అధినేత్రి మాయావతి, జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధా ని దేవగౌడ, ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయ, బీజేడీ లోక్‌సభాపక్ష నేత భర్తృహరి మెహతాబ్‌లతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నాయకుడు, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌, శివసేన వంటి పార్టీలతో సమావేశమై రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి.