//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏకే47 రైఫిల్‌ వికెట్‌గా ఉగ్రవాదుల క్రికెట్‌

Category : editorial


అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదులు ఏకంగా ఏకే47 రైఫిల్‌ని వికెట్‌గా వాడుకుని క్రికెట్‌ ఆడటం వెలుగులోకి వచ్చింది.  దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులు వికెట్లకు బదులుగా గన్నులు పెట్టుకుని క్రికెట్‌ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఓ అటవీ ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదులు ఏకే-47 రైఫిల్‌ను వికెట్‌గా పెట్టి క్రికెట్‌ ఆడారు. ఈ దృశ్యాన్ని వారిలో ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఖాళీ సమయాల్లో ఉగ్రవాదులు క్రికెట్‌ ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తారని, మిగతా సమయాల్లో భారత జవాన్లపై, అమాయకులపై దాడులు జరుపుతుంటారని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా,ఇటీవల కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని పోలీసులు వెల్లడించారు.

Related News