//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రిటన్ లో ఉగ్రదాడి

Category : national

లండన్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, ప్రధాని సహా పలువురు మంత్రులు, ఎంపీలు తమ కార్యకలాపాల్లో ముగినిపోయారు. ఇంతలో వూహించని ప్రమాదం. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేతిలో కత్తితో బీభత్సం సృష్టించాడో వ్యక్తి. అడ్డుకోబోయిన పోలీస్‌ అధికారిపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పోలీసును చూసిన ఓ మంత్రి.. తక్షణం బయటకొచ్చారు. ప్రమాదమని తెలిసినా.. తన భద్రతను కూడా పట్టించుకోకుండా ఆ పోలీసును కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు.బ్రిటిష్‌ పార్లమెంట్‌ సముదాయంలో బుధవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి లోనికి వచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీస్‌ అధికారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో పార్లమెంట్‌లో ఎంపీలంతా కొంతసేపు బందీలుగా లోపలే ఉండిపోయారు. ఇంతలో బ్రిటిష్‌ కన్సర్వేటివ్‌ ఎంపీ, విదేశాంగ మంత్రి తోబియాస్‌ ఎల్‌వుడ్‌.

తానేమైనా సాయం చేయగలనేమోనని సెక్యూరిటీని పక్కనబెట్టి భవనం నుంచి బయటకొచ్చారు. గది బయట రక్తపుమడుగులో పడి ఉన్న పోలీస్‌ అధికారిని చూసిన తోబియాస్‌ వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. కొనవూపిరితో ఉన్న పోలీస్‌కు నోటి ద్వారా కృత్రిమశ్వాస అందించారు. గుండెకు రక్తప్రసరణ అయ్యేలా ఛాతీపై కొడుతూ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే తోబియాస్‌ ప్రయత్నం ఫలించలేదు. తీవ్ర రక్తస్రావమైన ఆ పోలీస్‌ అధికారి కాసేపటికి ప్రాణాలు కోల్పోయాడు.రాజకీయాల్లోకి రాకముందు తోబియాస్‌ బ్రిటన్‌ మిలటరీలో పనిచేశారు. కాగా.. 2002లో ఇండోనేషియాలోని బాలీలో జరిగిన ఉగ్రపేలుళ్ల ఘటనలో తోబియాస్‌ తన సోదరుడు జోనథాన్‌ను కోల్పోయారు. తన సోదరుడిలా మరొకరు ఉగ్రదాడికి బలవకూడదనే ఉద్దేశంతో ప్రమాదమని తెలిసినా సాహసించి పోలీసును కాపాడేందుకు తోబియాస్‌ చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.బ్రిటిష్‌ ఉగ్రదాడి ఘటనలో పోలీస్‌ అధికారి సహా ఐదుగురు మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు.