//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లాస్ వేగాస్ లో మారణ హోమం .50 మంది మృతి ...

Category : world

లాస్‌వెగాస్‌లోని ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దాదాపు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తిని 64ఏళ్ల వ్యక్తి ని స్టీఫెన్‌ పెడాక్‌గా గుర్తించారు. స్టీఫెన్‌ స్థానికుడేనని పోలీసులు వెల్లడించారు. లాస్‌వెగాస్‌ స్ట్రిప్‌లో నిర్వహిస్తున్న ది రూట్‌ 91 హార్వెస్ట్‌ కంట్రీ సంగీత కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమంలో చొరబడిన దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు . మాన్‌డ్లే బే హోటల్‌లోని 32వ అంతస్తుకు చేరుకున్న అతడు తొలుత అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని కాల్చి చంపాడు.

అనంతరం మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు హాజరైన వారిపై తూటాల వర్షం కురిపించాడు. తుపాకీ పేలుళ్ల చప్పుడు వినిపించేసరికి భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు దుండగుడిపై కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.