Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ నీ కంగారు పెడుతున్న ఆ రెండు పెద్ద సినిమాలు....?

Category : movies

టాలీవుడ్ చిత్ర సీమలో ఏ హీరో సినిమా ఆ హీరో చేసుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా,ఏటువంటి గొడవలు లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు.అలాంటిది కొన్ని సందర్భాలలో ఒకరి సినిమా వల్ల ఇంకొకరి సినిమాకి క్లాష్ కూడా రావొచ్చు. అపుడు చూడాలి ఆ సినిమా వల్ల వచ్చే ట్రబుల్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో నే కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని నమ్ముకుని అంతా ముందుకు సాగిపోతూ ఉంటారు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లకు నిలయం, అందువల్ల దానికే ఎక్కువ ఓటేస్తారు. ఇపుడు అదే జరుగుతోంది.ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందుకే ఇపుడు ఆ సినిమాల వల్ల పెద్ద టెన్షన్ పట్టుకుంది. అందులో ఒకటి మెగాస్టార్ నటిస్తున్న సైరా మూవీ...... రెండవది ప్రభాస్ సాహో......ఈ రెండు మూవీస్ స్టార్ట్ అయి చాలా కాలమే అవుతుంది. అయితే ఈ సినిమాలు రిలీజ్ ఎపుడు అంటే మాత్రం చెప్పడం కష్టమే.

మెగా స్టార్ చిరంజీవి " సైరా " నరసింహ రెడ్డి ముందుగా ఈ సంక్రాంతి అన్నారు. ఆ తరువాత వచ్చే సమ్మర్ అన్నారు.ఆ పై ఆగస్ట్ అన్నారు. ఇపుడు దసరా వద్ద ఆగింది. తేడా వస్తే 2020 సంక్రాంతికి రిలీజ్ అని కూడా అంటున్నారు. అలాగే ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కూడా ఎన్నో డేట్స్ మారి ఆగస్ట్ న రిలీజ్ అని అంటున్నారు. అయితే అది కూడా నమ్మకం లేదనే చెప్పాలి. అటూ ఇటూ సాగదీసి దసరాకు తెస్తారా అన్నది కూడా డౌట్ హే. అదే జరిగితే సైరా మూవీ కూడా సంక్రాంతి వరకూ జరుగుతుంది. అపుడు సంక్రాంతి పెద్ద సినిమాలకు దెబ్బేనని రేసులో ఆల్రెడీ ఫిక్స్ అయిన వారు కంగారు పడుతున్నారు. ఇప్పటికి చూస్తే నాగార్జున, మహేష్ బాబు, బాలక్రిష్ణ సంక్రాంతికి కర్చీఫ్ వేసేశారు. సైరా వస్తే ఇపుడు మొత్తం రిలీజ్ లే గందరగోళంలో పడతాయి. ఏమవుతుందో చూడాలి.