ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషకం సంపాదిస్తున్న క్రీడాకారిణి, టెన్నిస్ గ్రేట్ సెరినా విలియమ్స్ తాజాగా ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. జనవరిలో తాను 23వ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో(ఆస్ట్రేలియన్ ఓపెన్)ఒక్క సెట్ కూడా కోల్పోకుండా నెగ్గినపుడు, తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని తెలియ పరిచి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. 35 సంవత్సరాల సెరినా మోకాలు గాయం తరువాత ఏ టోర్నమెంటులో పాల్గొనలేదు. ఇంకొక 20 వారాల వరకు ఆమె ఏ టోర్నమెంటులో పాల్గొనలేదని విషయం ఆమె పోస్ట్ చేసిన ఫొటోగ్రాఫ్ ద్వారా తెలుస్తుంది.