కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ పై పార్లిమెంట్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే.బడ్జెట్ లో ఆంధ్ర కు అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు నిరసనలు కూడా చేసారు.గత కొన్ని రోజులగా చాలామంది బడ్జెట్ పై స్పందించారు.అలాగే కేంద్ర మంత్రి కూడా ఒక ప్రకటన చేసారు...వివరాలలోకి వెళ్తే,
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించడానికి ఇది సమయం కాదని కేంద్రం మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ప్రస్తుతం బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోందని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తానే సూచించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు ఆదాయం, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని... ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అంత శక్తి లేదని వివరించారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అశోక్‌గజపతిరాజు అన్నారు.