//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష హెచ్చరిక

Category : national

అల్పపీడనం శుక్రవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే వచ్చే 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

అల్పపీడనం స్థిరంగా ఉంటే తరువాత రెండు రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు అంచనా వేశారు. కాగా ఈ నెల 14లోగా ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నది. కాగా రాత్రి ఉష్ణోగ్రతలు తెలంగాణలో నాలుగు నుంచి ఆరు, కోస్తాలో ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

బంగాళాఖాతంలో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 13,14, 15 తేదీల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.