//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెక్స్ సినిమాలకే సెగ పుట్టిస్తున్న తెలుగు సినిమాలు....?

Category : movies

సమాజాన్ని వంద రెట్లు ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న ఏకైక మాధ్యమము.... విజువల్ మీడియా అందులో భాగమే టీవి,సినిమా, సెల్ ఫోన్ , న్యూస్ మొదలైనవి. ప్రస్తుత సమాజంలో వీటి ప్రభావం ఎంతలా ఉందంటే మాటల్లో చెప్పలేము.అంతలా మానవుని మనుగడను, అలవాట్లను నూటికి నూరు పాళ్ళు ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా సినిమాల కున్న స్థానం నంబర్ వన్ అనే చెప్పుకోవాలి.అంతలా ఒక సినిమా మనపై వంద శాతం ప్రభావం చూపిస్తుంది. మారుతున్న అలవాట్లు పెరుగుతున్న టెక్నాలజీ మనిషిలో నీ అసాధారణ శక్తిని మెల్కొల్పుతు ఉంటుంది. ఎక్కడో వందేళ్ల కింద హాలీవుడ్ లో మొదలైన ఈ సినిమా విప్లవం. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి పెద్ద సమయం అయితే పట్టలేదు కానీ.దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగానే మన పై పడింది అని మాత్రం చెప్పవచ్చు.ఒక మనిషికి ఆకలి, నిద్ర,దాహం ఎలా అయితే జీవించడానికి అవసరం అయ్యయో అంతలా సినిమా కూడా మన అలవాట్లలో ఒకటిగా మారిపోయింది.

ఈ విషయాన్ని పక్కన పెడితే .....తాజాగా మన తెలుగు చిత్ర సీమలో ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలను చూస్తూ ఉంటే ....ఆ సినిమాల ప్రభావం. మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందనే చెప్పాలి. " మితి మీరిన రొమాన్స్.... సెక్సు సినిమాలను తలపించే శృంగార భావు కత.....సినిమా చూసే సగటు ప్రేక్షకుడి మనసుని.... ఆలోచనని అతలాకుతలం చేసే రకమైన ప్రేరణ.ఇదే ప్రస్తుత మన తెలుగు సినిమాలు నమ్ముకుంటున్న ఫార్ములా. సినిమా హిట్ కొట్టా లన్న ఆ సినిమా పై కాసుల వర్షం కురవాలి అన్న మేకర్స్ నమ్ము కుంటున్న హిట్ మంత్రం.. తాజాగా ఈ కోవలోకే వచ్చాయి పలు చిత్రాలు... అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్సు 100, చీకటి గదిలో చితకొట్టుడు, 4 లెటర్స్,వంటి సినిమాలు ఈ ఫార్ములానే నమ్ముకుని హిట్ కొడితే....ఇదే మంత్రాన్ని తాము నమ్ముకుని ఇంకా పెద్ద హిట్ కొడతాము అన్నట్టు....తాజాగా ఏడు చేపల కథ, డిగ్రీ కాలేజ్ వంటి సినిమా ట్రైలర్స్ విడుదలకు ముందే సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలు మేకింగ్,టేకింగ్ నుంచి ఇందులో హైలెట్ గా నిలుస్తున్న కొన్ని అంశాలు ఏమిటి అంటే .... మోతాదు కి మించిన రొమాన్స్, సెక్స్ సినిమాలను తలపిస్తున్న లిప్ లాక్ సీన్స్. వినడానికే వికారమైన డబల్ మీనింగ్ డైలాగ్స్. ఇలా వచ్చే ప్రతి సినిమా కూడా ఓ లవ్ స్టొరీ బ్యాక్ డ్రాప్ లోనే రావడం.అందులో లవ్ స్టోరీ కంటెను రొమాన్స్ స్టోరీనే హైలెట్ చేయడం ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఇలా వైలెన్స్ సెక్స్ నీ ఎంకరేజ్ చేసే విధమైన సినిమాలు రావడం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది లేదు...ఈ సినిమాల మూలాన ఆడవాళ్ళ పై ఆఘాహిత్యలు జరగ కుంటే అదే పది వేలు..ఇప్పటికే రోజు కొక్క చోట ఆడవాళ్ళ పై జరిగే నేరాలు ఘోరాలకు పరోక్షంగా ప్రేరణ కలిగిస్తున్న వి .... సినిమాలే కావడం గమనార్హం. అలాంటి సందర్భాలలో ఇలాంటి రకమైన సినిమాలు తీయడం అనేది.ఎంత వరకు హర్షణీయం.

పొట్టి పొట్టి బట్టల్లో..... బొడ్డు కనిపించే విధంగా..... అర్ధ నగ్న భావా వేషంతో కుర్రాళ్ల హృదయాల్లో లేని పోని కోర్కెలు కలిగించే విధమైన రొమాన్స్ కి సై అంటున్న మేకర్స్.ఈ రక మైన సినిమాల వల్ల ఎలాంటి లాభాలు ముటా కట్టుకుంటారో వారికే తెలియాలి.ఇప్పటికే ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి చేటు కలుగుతుంది.అన్న ధోరణిలో ఇలాంటి సినిమాలు బ్యాండ్ చేయాలి అనే వారికి బాసట గా నిలుస్తున్న.... వీటిని ఆపే శక్తి వారిలో లేక పోవడం శోచనీయం. అసలు ఇలాంటి సినిమాలు సెన్సార్ ఎలా అవుతాయి అన్న మాటకి వస్తే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో సైతం ఇలాంటి సీన్స్ కామన్ కదా ఇంకేంటి అభ్యంతరం అనే స్టేజ్ కి వెళ్లి పోయింది మన సమాజం.సినిమాల ప్రభావం వంద శాతం పడుతున్న మన మీద ఇలాంటి సినిమాల మూలాన బాగు పడడం మాట పక్కన పెట్టి నష్టం వాటిల్లదని మాత్రం ఎవరూ చెప్పగలరు.