//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్‌ని కుదిపేసే బ్లాస్టింగ్ వార్త‌.. అమెరికా సెక్స్ రాకెట్‌లో అడ్డంగా బుక్ అయిన తెలుగు టాప్‌ హీరోయిన్స్..!

Category : movies

అమెరికాలో టాలీవుడ్ నిర్మాత, ఆయన భార్య సెక్స్ రాకెట్‌లో దొరికార‌నే వార్త సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతోంది. కిష‌న్ మోదుగుమూడి అలియాస్ విభా జ‌యమ్ మ‌రియు అత‌ని భార్య చంద్ర మోదుగుమూడి చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ న‌డిపించ‌డం అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా కిష‌న్ అత‌ని భార్య‌ని అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేశార‌ని స‌మాచారం. పోలీసుల విచార‌ణ‌లో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు బ‌య‌ట ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. ఇన్వెస్టిగేష‌న్‌లో భాగంగా వారి వ‌ద్ద ఉన్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని వారి మెయిల్స్ చెక్ చేయ‌గా..అయితే ఓ హీరోయిన్ త‌న‌ని మాన‌సిక క్షోభ గురి చేయోద్ద‌ని ఇలాంటి బిజినెస్‌లో నన్ను భాగం చేయోద్దంటూ వేడుకున్న మెయిల్ ఒక‌టి ద‌ర్యాప్తులో దొరికింద‌ని పోలీసులు అన్నారు

ఇక‌ చాలా కాలంగా సెక్స్ రాకెట్ న‌డుపుతున్న కిష‌న్ తెలుగు హిట్ సినిమాల‌కి కో ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హరించాడు. ఈ కేసుపై పూర్తి విచార‌ణ జ‌రిపి అన్ని విష‌యాలు మీడియాకి వివ‌రిస్తామ‌ని అమెరికా పోలీసులు పేర్కొన్నారు. తెలుగు హీరోయిన్స్‌తో పాటు యాంకర్స్‌ని సినిమా షూటింగ్‌లు, ఈవెంట్స్ పేరుతో తాత్కాలిక వీసా ఇప్పించి అమెరికాకి తీసుకెళ్ళ‌డం, అక్క‌డ ఖ‌రీదైన హోటల్స్‌లో వారిని ఉంచి విటుల‌ని పంప‌డం కొన్నాళ్ళుగా జ‌రుగుతూ వ‌స్తుంది. ఈ స్కాంని అమెరికా పోలీసులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీళ్లపై అక్కడి పోలీసులకు ఎప్పటి నుంచో కన్ను ఉందట, దాదాపు 6 నెలల పాటు నిఘా ఉంచి, స్పష్టమైన ఆధారాలతో ఈ సెక్స్ రాకెట్ ని రెడ్ హేండెడ్ గా పట్టుకున్నారని ఈ పోస్ట్ లో వుంది. అందులో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు, ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న వాళ్ళు, ఎన్నో కొన్ని సినిమాలతో బిజి గా ఉన్న వాళ్ల పేర్లు ఇందులో ఉన్నాయని స‌మాచారం.