//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర్జున్ అవార్డుల జాబితాలో తెలుగు క్రీడాకారిణి

Category : sports

విలువిద్య క్రీడలో ఆంధ్రప్రదేశ్‌కు వన్నె తెచ్చిన వెన్నం జ్యోతి సురేఖ అర్జున అవార్డు లకు ఎంపిక చేసిన జాబితాలో చోటు దక్కించు కోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైవుతోంది. విజయవాడలో ఓల్గా ఆర్చరీ అకాడమీ కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ సారథ్యంలో విలువిద్యలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.

ప్రపంచ మహిళా ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్న సురేఖ అంతర్జాతీయ స్ధాయిలో 17 పతకాలు, జాతీయ స్థాయిలో 50 పతకాలను సాధించింది.నాలుగేళ్ల ప్రాయంలోనే కృష్ణా నదిని ఈది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుకెక్కింది. ఆ తర్వాత 13 ఏళ్ల వయస్సులో ఆర్చరీలో 2007లో ప్రవేశించింది.

జాతీయ సీనియర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేఖ 2011 ఇరాన్‌ ఆసియా ఆర్చరీలో కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం, 2015 బ్యాంకాక్‌లో జరిగిన వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. 2013 చైనాలో జరిగిన మహిళా జూనియర్‌ కాంపౌండ్‌ టీమ్‌, వ్యక్తిగత ఈవెంట్లలో కాంస్యాలను కైవసం చేసుకుంది. ఇటీవల ఉలాన్‌బతర్‌లో జరిగిన ప్రపంచ స్టేజ్‌ పోటీల్లో తృటిలో కాంస్యం చేజార్చుకుంది.