//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టెలినార్ అదిరిపోయే ఆఫర్లు !

Category : business

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం టెలినార్‌ సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

94 రూపాయల ఎస్‌టివితో రీచార్జ్‌ చేసుకుంటే.. 28 రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.

299 రూపాయల ఎస్‌టివితో 84 రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌ మాట్లాడుకోవచ్చని, 143 రూపాయల ఎస్‌టిడితో 28 రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌తోపాటు 2జిబి 4జి డేటాను పొందవచ్చని సంస్థ తెలిపింది.

కస్టమర్లు చెల్లించే మొత్తానికి తగిన స్థాయిలో విలువను అందించడంపై తాము దృష్టిసారించామని, ఇందులో భాగంగానే కొత్త ఆఫర్లు అందిస్తున్నామని కంపెనీ సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) శ్రీనాథ్‌ కొటి యన్‌ తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో 42 లక్షల మంది కస్టమర్లకు తమ కంపెనీ సర్వీసులు అందిస్తోందని చెప్పారు.