కాలింగ్, డాటా సేవలకు కనిష్ఠ చార్జీ పరిమితిని నిర్ణయించాలని కొందరు మొబైల్ ఆపరేటర్లు కోరినట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తెలిపింది. ఒకవేళ సంస్థల అభ్యర్థనకు అనుగుణంగా ట్రాయ్ కనీస పరిమితి విధిస్తే.. రిలయన్స్ జియో తరహా ఉచిత వాయిస్, డాటా సర్వీసులకు తెరపడనుంది. రెండు సర్వీసులపై కనీస చార్జీ పరిమితులను విధించాలని కొన్ని సంస్థలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయని, వారి ప్రతిపాదనను పరిశీలించడం జరుగుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.