//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు టెలికం మంత్రి మనోజ్ సిన్హాతో టెల్కోల భేటీ

Category : business

దేశీయ టెలికం దిగ్గజాలు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హాతో గురువారం సమావేశమవుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెలికం రంగంపై వీరు కూలంకుషకంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌తోపాటు ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ, ఐడియా ఎండీ హిమాన్షు కపానియా, టాటా సన్స్ డైరెక్టర్ ఇషాత్ హుస్సేన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్రా నహాటాలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. టెలికం కార్యదర్శి అరుణ సౌందర్యరాజన్ కూడా పాల్గొంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెలికం రంగ సంస్థలపై అంతర్గత మంత్రివర్గం సమావేశమై చర్చించిన మరుసటి రోజే మంత్రితో భేటీకావడం విశేషం. ఎయిర్‌టెల్, ఐడియా అనుసరిస్తున్న వ్యాపార విధానల వల్లనే టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడి నెలకొందని గడిచిన వారంలో రిలయన్స్ జియో ఆరోపించిన విషయం తెలిసిందే. ధరల విషయంపై టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్..జియోపై ఆరోపణలు గుప్పించింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినిమయ చార్జీ, జీఎస్టీ చార్జీలను తగ్గించాలని టెలికం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం టెలికం రంగానికి చెందిన మొత్తం సంస్థల అప్పు రూ.4.6 లక్షల కోట్ల స్థాయిలో ఉంది.